TANUKU-INFO

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ..

తణుకు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన, సత్వర వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన ఆమె వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్యులు ప్రతి రోగిని ఆప్యాయంగా పలకరించి మానవత్వంతో సేవలందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశుభ్రత, మందుల లభ్యత, వైద్య సేవలను సమీక్షించిన కలెక్టర్, పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులే భరోసాగా నిలవాలని, సేవాభావంతో విధులు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

Posted on 28-06-2026 05:27 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠