TANUKU-INFO

ఆసుపత్రి సీజ్ చేసిన వైద్య ఆరోగ్యశాఖ..

తణుకు: తణుకు మండలం పైడిపర్రులోని స్టార్ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గీతాబాయి ఆధ్వర్యంలో అధికారులు గురువారం సీజ్ చేశారు. గత నెల 16న ఆసుపత్రిలో నిర్వహించిన శస్త్రచికిత్స అనంతరం ఓ బాలింత మృతి చెందిన ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటికే ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులకు సరైన వివరణ ఇవ్వకపోవడంతో ఆసుపత్రిని తనిఖీ చేసి సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, వైద్య నిబంధనల ఉల్లంఘనలపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Posted on 11-06-2026 05:43 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠