TANUKU-INFO

అమర్నాథ్ వ్యాఖ్యలపై మహిళల నిరసన..

తణుకు: రాష్ట్ర హోం మంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తణుకులో తెలుగుదేశం మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజకీయ విమర్శలు హద్దులు దాటకూడదని, మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళల పట్ల గౌరవం చూపాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందన్నారు. మంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Posted on 16-06-2026 06:26 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠