TANUKU-INFO

వైసీపీ పాలనలో దళితులపై దౌర్జన్యాలు పెరిగాయి..

తణుకు: వైసీపీ పాలనలో ఎస్సీలపై దౌర్జన్యాలు, అక్రమాలు పెరిగాయని జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుక్కా సాయిబాబు విమర్శించారు. తణుకు కూటమి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చిత్రపటానికి నివాళులు అర్పించారు. వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, డాక్టర్ సుధాకర్ ఘటనలను ప్రస్తావిస్తూ దళితులపై కక్షపూరిత రాజకీయాలు చేశారని ఆరోపించారు. దళితులపై జరిగిన ఘటనలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Posted on 19-05-2026 07:10 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠