TANUKU-INFO

సిపిఐ అగ్రనేత వర్ధంతి ఘనంగా నిర్వహణ..

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మాజీ ప్రధాన కార్యదర్శి, విప్లవ యోధుడు చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి తణుకులో ఘనంగా నిర్వహించారు. సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ రాజేశ్వరరావు పీడితుల కోసం జీవితాంతం పోరాడారని, ఆయన త్యాగం ఆదర్శమన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి చేసిన సేవలను కొనియాడారు. పట్టణ, ఏరియా నాయకులు సహా పలువురు పాల్గొని నివాళులర్పించారు.

Posted on 09-04-2026 04:18 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠