ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం ప్రజలకు ఊరట, రైతులకు ఆందోళన..
ప.గో.జిల్లా, తణుకు: గత కొన్ని వారాలుగా ఎండలు తీవ్రంగా పెరిగి, ఏప్రిల్ ప్రారంభానికి ముందే ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని చల్లని గాలులు, మబ్బులు కమ్ముకోవడంతో ప్రజలకు ఊరట లభించింది. వేడి నుంచి ఉపశమనం దొరకడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ అనూహ్య మార్పు మామిడి, వేసవి పంటల రైతులకు ఆందోళన కలిగిస్తోంది. పంటల పెరుగుదల, దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో రైతులు పరిస్థితిని ఆందోళనగా గమనిస్తున్నారు. సహజ మార్పు ప్రజలకు ఉపశమనం ఇచ్చినా, రైతులకు మాత్రం టెన్షన్ పెంచింది.
Posted on 06-04-2026 10:31 AM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
