TANUKU-INFO

డ్రగ్స్‌కు దూరంగా, క్రీడలకు చేరువగా..

తణుకు: యువతను డ్రగ్స్‌ సహా మాదకద్రవ్యాల బారిన పడకుండా క్రీడల వైపు మళ్లించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఎన్టీఆర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసిందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో ఈసారి నియోజకవర్గ వ్యాప్తంగా 38 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో మెగా-11 జట్టు విజేతగా నిలవగా, పవర్ స్టార్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు రూ.60 వేలు, రన్నరప్ జట్టుకు రూ.30 వేల నగదు బహుమతులు అందజేశారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రీడాకారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Posted on 14-06-2026 07:26 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠