TANUKU-INFO

ఆసుపత్రిపై విచారణ వేగం, షోకాజ్ నోటీసు జారీ..

తణుకులోని స్టార్ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన బాలింత మృతి ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. జి. గీతాబాయ్ స్పందించారు. సమాచారం అందిన వెంటనే ఆసుపత్రిపై ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులు, చికిత్స విధానం పరిశీలించినట్లు తెలిపారు. బీహార్‌కు చెందిన గర్భిణిని ఆర్‌ఎంపీ సహకారంతో ఆసుపత్రికి తీసుకువచ్చి శస్త్రచికిత్స చేసిన గంటల వ్యవధిలోనే బాలింత మృతి చెందినట్లు వెల్లడించారు. మూడు సంవత్సరాలుగా మూసివేసిన ఆసుపత్రి అనధికారికంగా సేవలు అందిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఆసుపత్రికి షోకాజ్ నోటీసు జారీ చేసి పూర్తి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Posted on 23-05-2026 08:07 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠