అన్నవరప్పాడు రికార్డు స్థాయిలో జనసేన సభ్యత్వ నమోదు..
నిడదవోలు నియోజకవర్గం: పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. గ్రామ అధ్యక్షుడు పి. సూర్య నాగేశ్వరరావు నాయకత్వంలో ఇంటింటికి వెళ్లి పార్టీ ఆశయాలను వివరించడంతో ఒక్క గ్రామంలోనే 700కు పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయి. చిన్న గ్రామమైనా పెద్ద లక్ష్యంతో కార్యకర్తలు విశేష స్పందన తీసుకువచ్చారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలపై ప్రజల నమ్మకం ఈ నమోదు ద్వారా ప్రతిబింబించింది. నాయకులు, కార్యకర్తలు సూర్య నాగేశ్వరరావును అభినందించారు. నిడదవోలు ప్రాంతంలో జనసేన బలం పెరుగుతోందని పేర్కొన్నారు.
Posted on 13-04-2026 11:07 AM | by Admin
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
