విలేఖరి హత్యని నిరసిస్తూ జర్నలిస్టుల ధర్నా..
తణుకు: చిత్తూరు జిల్లా వీ.కోటకు చెందిన ABN విలేఖరి జగన్‌మోహన్ రెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ తణుకు తహసిల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ అశోక్ వర్మకు వినతిపత్రం అందజేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రిక, ప్రాంతం, యూనియన్ భేదాలు లేకుండా జర్నలిస్టులంతా ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తణుకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Posted on 29-04-2026 05:24 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
