ఎమ్మెల్యే కార్యాలయంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం..
ప.గో.జిల్లా, తణుకు: వేసవి దాహార్తిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు ఎమ్మెల్యే కార్యాలయంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఉపశమనం కల్పించడమే లక్ష్యమన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో దాతలు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. సేవా భావంతో ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Posted on 09-04-2026 05:22 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
