TANUKU-INFO

కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం..

తణుకు మండలం మండపాక గ్రామ పరిధిలోని కాలువలో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాలువలో మృతదేహం కొట్టుకొచ్చినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న తణుకు రూరల్ పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై తణుకు రూరల్ ఇన్‌చార్జి ఎస్సై జనా సతీష్ కేసు నమోదు చేసి మృతుడి వివరాల గుర్తింపు, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Posted on 18-06-2026 09:07 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠