TANUKU-INFO

ఏఎస్ఆర్ క్రికెట్ అకాడమీ ప్రారంభం..

క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తూ ఏఎస్ఆర్ విద్యాసంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఏఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రారంభించిన ఏఎస్ఆర్ క్రికెట్ అకాడమీని ఆయన ప్రారంభించారు. చిన్నారుల నుంచి అండర్-18 క్రీడాకారుల వరకు శిక్షణ అందించడం మంచి పరిణామమన్నారు. విద్యాసంస్థల చైర్మన్ విజయవర్ధన్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం కూడా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Posted on 20-05-2026 06:08 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠