TANUKU-INFO

పర్మిట్ రూమ్‌ల్లోనే మద్యం సేవించాలి: ఎక్సైజ్ హెచ్చరిక..

తణుకు మండలం మండపాక గ్రామంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు. మద్యం వినియోగదారులు లైసెన్స్ పొందిన మద్యం దుకాణాల పర్మిట్ రూములు, బార్లలో మాత్రమే మద్యం సేవించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.

Posted on 19-06-2026 07:19 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠