విద్యుత్ సంస్కరణల్లో చంద్రబాబు పాత్ర కీలకం..
తణుకు: విద్యుత్ సంస్కరణల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర అమోఘమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మహానాడు తొలి రోజు విద్యుత్ సంస్కరణలు, ట్రూ డౌన్ చార్జీలపై తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని 5 వేల మెగావాట్ల నుంచి 11 వేల మెగావాట్లకు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల ఏర్పాటు ద్వారా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేశారని తెలిపారు. వైసీపీ పాలనలో విద్యుత్ రంగం దెబ్బతిందని, ప్రజలపై భారీ భారం మోపారని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారాన్ని భరిస్తూ 1.30 కోట్ల కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు.
Posted on 27-05-2026 09:12 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
.jpeg)
