TANUKU-INFO

బహిరంగ మద్యపానంపై ఎక్సైజ్ ఉక్కుపాదం..

తణుకు: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అనధికారికంగా బెల్ట్ షాపులు నిర్వహించడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని తణుకు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నాలుగు రోజుల ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌లో భాగంగా తణుకు స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలు, బహిరంగ మద్యపానంపై నిఘా పెంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇరగవరం మండలం కత్తెవపాడు, ఇరగవరం, తేతలి, తణుకు ప్రాంతాల్లో నాలుగు కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మద్యం షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూములు, బార్లలో మాత్రమే మద్యం సేవించాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Posted on 18-06-2026 09:47 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠