TANUKU-INFO

బర్త్‌డే వేడుకల పై పోలీసుల హెచ్చరికలు..

తణుకు: బర్త్‌డే వేడుకల సందర్భంగా ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బందులు కలిగించే విధంగా రోడ్లపై వాహనాలు నిలిపి వేడుకలు నిర్వహించవద్దని తణుకు టౌన్ పోలీసులు హెచ్చరించారు. పబ్లిక్ ప్రదేశాలు, జాతీయ రహదారులు, సర్వీస్ రోడ్లు, అపార్ట్‌మెంట్లు, కాలనీలు, ఇళ్ల వద్ద అధిక శబ్దాలతో డీజేలు ఏర్పాటు చేయడం నిషేధమన్నారు. రాత్రి 10 గంటల తర్వాత శబ్ద కాలుష్యం కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులు చదువుకునే ప్రాంతాలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే బాణాసంచా కాల్చడం, మద్యం సేవించి రోడ్లపై హంగామా చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ కంట్రోల్ రూమ్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Posted on 18-05-2026 08:38 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠