ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత., మహిళ మృతిపై బంధువుల ఆందోళన..
తణుకు: తణుకుకు చెందిన సురవరపు వరలక్ష్మి (55) మృతి ఘటనతో శ్రీకరి ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటి వద్ద కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం శ్రీకరి ఆసుపత్రికి తరలించారు. అయితే నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లిన వరలక్ష్మికి సిబ్బంది ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. మృతురాలు చనిపోయిన తర్వాత కూడా ఆసుపత్రి బిల్లు చెల్లించాలని, అనంతరం మరో ఆసుపత్రికి తరలించాలని సిబ్బంది సూచించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న తణుకు పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
Posted on 13-06-2026 07:16 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
