TANUKU-INFO

తేతలి హైవేపై లారీ ప్రమాదం..

ప.గో. జిల్లా, తణుకు: తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున లారీ అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టింది. రావులపాలెం నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న ప్రభావంతో వంతెన రైలింగ్‌తో పాటు లారీ ముందు భాగం ధ్వంసమైంది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తర్వాత ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా హైవే పోలీసులు, తణుకు రూరల్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Posted on 06-04-2026 10:20 AM | by Kalyan
View Latest Deals & Offers
🏠