TANUKU-INFO

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి..

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పునరుద్ధరణ కోసం ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని తణుకు దళిత క్రైస్తవ ఐక్యవేదిక పిలుపునిచ్చింది. స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన దళిత క్రైస్తవ రాజ్యాంగబద్ధ హక్కుల సాధన సభలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. కన్వీనర్ కోనాల భీమారావు మాట్లాడుతూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లోని వివక్షపూరిత నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. మతం మారినా దళితులపై వివక్ష కొనసాగుతోందన్నారు. మాల, మాదిగలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని నాయకులు పిలుపునిచ్చారు. సభలో న్యాయవాదులు, పాస్టర్లు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Posted on 24-05-2026 07:47 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠