ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగ..
తణుకు: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని యోగాసనాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగ” అనే థీమ్‌తో యోగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ద్వారా వయసు పెరిగే కొద్దీ వచ్చే శారీరక, మానసిక సమస్యలను అధిగమించవచ్చన్నారు. రాష్ట్రంలో 10 లక్షల యోగ శిక్షకులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే 2.5 లక్షల మంది సర్టిఫైడ్ శిక్షకులు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో యోగ గురువులు, ఔత్సాహికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Posted on 21-06-2026 11:10 AM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers


