రెండో విడత అన్నదాత సుఖీభవ..
అత్తిలి: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం రెండో విడత కింద 16,954 మంది రైతులకు రూ.11.47 కోట్ల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత వైసీపీ పాలనలో రైతులు సాగునీరు, ధాన్యం కొనుగోలు, గోనె సంచుల కొరత వంటి అనేక సమస్యలు ఎదుర్కొన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పుంత రోడ్ల అభివృద్ధి, సాగునీటి సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు.
Posted on 20-06-2026 06:50 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
