TANUKU-INFO

కూటమి విజయోత్సవ సభ., కారుమూరి పై విమర్శలు..

తణుకు: ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ విజయోత్సవ సభలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి దూరమైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయని అన్నారు. తణుకు నియోజకవర్గంలో రెండేళ్లలో రూ.2 వేల కోట్లకు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కుల రాజకీయాలు, తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో జరిగిన వ్యవహారాలపై కోర్టులు, దర్యాప్తు సంస్థలే నిజానిజాలు తేలుస్తాయని పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో తణుకును మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా నిలబెడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Posted on 17-06-2026 07:32 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠