నషా ముక్త్ భారత్ లక్ష్యంగా విద్యార్థులకు అవగాహన..
తణుకు: నషా ముక్త్ భారత్ అభియాన్ వారోత్సవాల సందర్భంగా తణుకులోని శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాలలో తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై కలిగే దుష్పరిణామాలు, డ్రగ్స్ తయారీ, రవాణా, విక్రయం, వినియోగానికి సంబంధించిన చట్టపరమైన శిక్షలను వివరించారు. డ్రగ్స్ నిర్మూలనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలతో పాటు డీ-అడిక్షన్, పునరావాస సేవలు కూడా అందిస్తున్నామని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్, ఈగల్ టీమ్ కోఆర్డినేటర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Posted on 25-06-2026 07:11 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
