TANUKU-INFO

గోస్తాని కాలువలో దివ్యాంగుడి వాహనం లభ్యం..

తణుకు: ఆంధ్ర సుగర్స్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న గోస్తాని కాలువలో వికలాంగుడికి చెందిన మూడు చక్రాల మోటార్ సైకిల్ లభ్యమైంది. వీరభద్రపురం గ్రామానికి చెందిన ఒక దివ్యాంగుడు మూడు రోజులుగా కనిపించడం లేదని ఆయన తల్లి తెలిపింది. కాలువను కట్టేయడంతో మోటార్ సైకిల్ పైకి తేలి బయటపడింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న బంధువులు, స్థానికులు అదృశ్యమైన వ్యక్తి కోసం గోస్తాని కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.

Posted on 22-04-2026 05:23 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠