అనుమతి లేని బైక్ సైలెన్సర్లపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్..
ప.గో. జిల్లా, తణుకు: అనుమతి లేని మోటారు సైకిల్ సైలెన్సర్లు వినియోగిస్తే వాటిని తొలగిస్తామని పట్టణ సీఐ డి. వెంకటేశ్వరరావు హెచ్చరించారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో పలువురు వాహనదారులకు జరిమానాలు విధించి, అనధికార సైలెన్సర్లు తొలగించారు. పది, ఇంటర్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో మైనర్లు బైక్‌లతో రోడ్లపై తిరిగితే ఉపేక్షించబోమని, వారికి వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అధిక శబ్ద సైలెన్సర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కళాశాలలు, పాఠశాలల వద్ద ఆకతాయిలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, విద్యార్థుల వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Posted on 04-04-2026 07:00 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
