చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైఎస్సార్‌సీపీ తీవ్ర విమర్శలు..
తణుకు: “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్ హాల్‌లో మాజీ మంత్రి డాక్టర్ కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండేళ్ల ప్రభుత్వ పాలనపై విమర్శాత్మక బ్యానర్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచారని కారుమూరి ఆరోపించారు. భూ హక్కులు, రిజిస్ట్రేషన్ వ్యవస్థ, మద్యం విధానం, పేకాట క్లబ్బులు, బెట్టింగ్‌ల అంశాలపై ప్రభుత్వాన్ని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేస్తూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Posted on 08-06-2026 07:36 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers


