TANUKU-INFO

ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు..

తణుకు: ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం, 2003 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 11 వేల మంది ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలుకు ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తణుకు కూటమి కార్యాలయంలో ఉపాధ్యాయులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం సీపీఎస్ రద్దు హామీ అమలు చేయలేదని విమర్శించిన ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించి పదవీ విరమణ అనంతర భరోసా కల్పించిందన్నారు. అలాగే 16 వేల ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసి విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు.

Posted on 25-06-2026 07:25 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠