TANUKU-INFO

రెండేళ్లలో రూ.2 కోట్ల అభివృద్ధి, సంక్షేమం..

తణుకు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో తణుకు నియోజకవర్గంలో రూ.2,082 కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ధాన్యం కొనుగోలు, అమరజీవి జలధార, బ్యాంకు లింకేజీ రుణాలు, తాగునీటి గ్రిడ్, రోడ్లు, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ప్రజలకు విస్తృతంగా లబ్ధి చేకూరిందన్నారు. రైతుల ఖాతాల్లో రూ.647.43 కోట్లు జమ చేయగా, మహిళా సంఘాలకు రూ.286.31 కోట్ల రుణాలు అందించామని చెప్పారు. రాబోయే మూడేళ్లలో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.

Posted on 12-06-2026 05:35 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠