ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభకు ఎమ్మెల్యే ఆత్మీయ విందు..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రతిభ కనబరచడం గర్వకారణమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. 2026 పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు “ప్రతిభ పురస్కారాలు” అందజేసి, తల్లిదండ్రులతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నారు. రాష్ట్ర సగటు 73%, జిల్లా సగటు 77.23% ఉండగా తణుకు నియోజకవర్గం 81% ఉత్తీర్ణత సాధించిందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగ సంస్కరణల ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Posted on 19-05-2026 07:56 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers

