డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం..
తణుకు: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాలలో తణుకు మండల న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్. ఆశీర్వాదం పాల్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని అన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, మొబైల్ వ్యసనానికి దూరంగా ఉండాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే ఈగిల్ టోల్‌ఫ్రీ 1972కు తెలియజేయాలని సూచించారు. వ్యసన విముక్తికి ఉచిత చికిత్స, పునరావాస సేవలు అందుబాటులో ఉన్నాయని, వైద్యుల సూచనల మేరకే మందులు వినియోగించాలని నిపుణులు వివరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, వైద్యులు, ఎక్సైజ్, డ్రగ్ శాఖ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Posted on 27-06-2026 05:16 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
