టీటీడీ ఛైర్మెన్ తొలగింపు డిమాండ్‌తో వైసీపీ పూజలు..
ప.గో. జిల్లా, తణుకు: తిరుపతి ప్రపంచవ్యాప్తంగా విశిష్టత కలిగిన పవిత్ర స్థలమని మాజీ మంత్రి కారుమూరి అన్నారు. దేవుడి ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా తప్పుబట్టారు. టీటీడీ ఛైర్మెన్ బి.ఆర్ నాయుడు వ్యవహారంపై విమర్శలు చేస్తూ, కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఆయనను వెంటనే తొలగించి తిరుపతి ప్రతిష్ఠను కాపాడాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు తణుకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు బి.ఆర్ నాయుడు తొలగింపునకు నినాదాలు చేశారు.
Posted on 04-04-2026 01:18 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
