సీడ్ బాల్స్‌తో పచ్చని భవిష్యత్తుకు శ్రీకారం..
తణుకు: విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించి హరిత విప్లవానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీడ్ బాల్స్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.50 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసి అటవీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో చల్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్క నాటి సంరక్షించాలని సూచించారు. వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుని మొక్కల పెంపకం ద్వారా పచ్చదనాన్ని పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Posted on 18-06-2026 06:55 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers



