TANUKU-INFO

మాదకద్రవ్యాల వ్యసన విముక్తిపై అవగాహన ర్యాలీ..

తణుకు: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకులోని శ్రీ ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ ఆసుపత్రిలో తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యసన విముక్తిపై అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.వి. ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామ్ గోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని డ్రగ్స్ వల్ల ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాలు, వ్యసన విముక్తికి అందుబాటులో ఉన్న చికిత్సలు, పునరావాస మార్గాలపై వివరించారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ నినాదాలతో ర్యాలీ నిర్వహించినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు.

Posted on 26-06-2026 06:24 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠