యోగ వారోత్సవాలకు ఎమ్మెల్యే శ్రీకారం..
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు రెండో వార్డు యోగా పార్కులో ప్రారంభమైన 14 రోజుల యోగ వారోత్సవాలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగ” అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా యోగాసనాలు చేసి అవగాహన కల్పించారు. వృద్ధాప్యంలో వచ్చే శారీరక, మానసిక సమస్యలను తగ్గించడంలో యోగా కీలకమని తెలిపారు. జూన్ 21న కోటి మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 10 లక్షల యోగ శిక్షకులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ప్రజలు యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యోగ శిక్షకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Posted on 07-06-2026 08:51 AM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers


