ప్రశాంతంగా ముగిసిన NEET పరీక్ష
జిల్లాలో నిర్వహించిన నీట్-2026 ప్రవేశ పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 2,475 మంది అభ్యర్థులకు గాను 2,262 మంది హాజరై 91.3 శాతం హాజరు నమోదుకాగా, 213 మంది గైర్హాజరయ్యారు. తణుకులోని రెండు పరీక్షా కేంద్రాల్లో 662 మంది విద్యార్థులకు గాను 624 మంది పరీక్ష రాయగా, 38 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను కలెక్టర్ నాగరాణి స్వయంగా తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా తనిఖీలు, సీసీ కెమెరా పర్యవేక్షణ, వైద్య, తాగునీరు, విద్యుత్ సదుపాయాలను సమీక్షించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
Posted on 21-06-2026 05:55 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers



