TANUKU-INFO

రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్..

ఈనెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తణుకు మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఆర్యవైశ్య సేవా సంఘ భవనంలో సమావేశమై వివరాలు వెల్లడించారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపు మేరకు ఆన్‌లైన్ మందుల విక్రయాలు, అనధికార ఫార్మసీలు, వైద్యుల ప్రత్యక్ష ప్రమేయంతో జరుగుతున్న మెడిసిన్ విక్రయాలు, నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ సరఫరా పెరగడం వంటి అంశాలకు నిరసనగా బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని, ఔషధ రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



Posted on 18-05-2026 02:06 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠