TANUKU-INFO

అరెస్ట్ ను ఖండించిన కారుమూరి, జూన్ 12 నిరసనకు పిలుపు..

తణుకు: మాజీ మంత్రి డాక్టర్ కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యారంటూ కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆయన ఖండించారు. తాను తన నివాసంలోనే ఉన్నానని, అరెస్ట్‌కు సంబంధించిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా జూన్ 12న నిర్వహించనున్న “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” మహా నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉదయం 8:30 గంటలకు తణుకు ఆర్ట్స్ కాలేజ్ వద్ద నుంచి ప్రారంభమయ్యే ఈ నిరసనలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Posted on 11-06-2026 02:16 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠