సురక్షిత తాగునీరు లక్ష్యంగా జలధార పనులకి శ్రీకారం..
తణుకు: ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో అమరజీవి జలధార కార్యక్రమం కింద రూ.54 కోట్ల వ్యయంతో తణుకు నియోజకవర్గంలో పనులు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఇరగవరం మండలం యర్రాయిచెరువులో వాటర్ ట్యాంకు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన ఆయన, 15 ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు, 154 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ నాటికి ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో నియోజకవర్గంలో రూ.2 వేల కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, రాబోయే మూడేళ్లలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
Posted on 11-06-2026 01:27 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
