కారుమూరి సునీల్ అరెస్టును ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ నిరసన..
తణుకు: ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ కుమార్ అరెస్టును ఖండిస్తూ తణుకు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ కేసులు, అరెస్టులతో ప్రజల గొంతుకలను అణచివేయడం సాధ్యం కాదని, ప్రశ్నించే స్వరాలను నిరోధించే ప్రయత్నాలను ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలుగా అభివర్ణించారు. కారుమూరి సునీల్ అరెస్టు కేవలం ఒక వ్యక్తిపై చర్య మాత్రమే కాదని, బీసీల ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. సునీల్‌కు సంఘీభావంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
Posted on 22-06-2026 11:32 AM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers

