తణుకు నియోజకవర్గంలో మహానాడుకు విశేష స్పందన..
తణుకు: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలకు తణుకు నియోజకవర్గంలో విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో 10 క్లస్టర్ల పరిధిలో వర్చువల్ విధానంలో మహానాడు వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్‌లో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ల ద్వారా కార్యకర్తలు, నాయకులు కార్యక్రమాలను వీక్షించారు. సమీప గ్రామాల నుంచి తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. ముందుగా నియమించిన క్లస్టర్ ఇన్‌చార్జీలు కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించారు. మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కదం తొక్కాయి.
Posted on 27-05-2026 01:08 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
.jpeg)

