TANUKU-INFO

సేంద్రీయ మునగాకు ఉత్పత్తులకు ప్రోత్సాహం..

తణుకు: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మండపాకలో యల్లారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రూ.37.70 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అనంతరం లక్కీ ఆర్గానిక్ ఫుడ్స్ స్టోర్‌ను ప్రారంభించి, సేంద్రీయ పద్ధతిలో తయారైన మునగాకు ఉత్పత్తులను ప్రజలు వినియోగించాలని పిలుపునిచ్చారు. రసాయన రహిత మునగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.

Posted on 29-06-2026 04:47 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠