TANUKU-INFO

సబ్‌జైలును సందర్శించిన జిల్లా జడ్జి..

తణుకు: జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవల సంస్థ చైర్మన్ శ్రీమతి సిరిపురపు శ్రీదేవి తణుకు సబ్‌జైలును సందర్శించి రిమాండ్ ఖైదీలకు అందుతున్న ఆహారం, వైద్య సేవలు, వసతి సౌకర్యాలను పరిశీలించారు. ఖైదీల సమస్యలు తెలుసుకుని, కేసుల వివరాలను అడిగి విచారించారు. న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేని వారికి మండల న్యాయ సేవల సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. జైలు విజిటింగ్ న్యాయవాది, పారా లీగల్ వాలంటీర్లు వారానికి రెండు రోజులు జైలు లీగల్ క్లినిక్‌లో న్యాయ సలహాలు అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి, జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ శ్రీహరి రావు, ప్యానెల్ న్యాయవాది కె.ఎల్. సత్యవతి, పారా లీగల్ వాలంటీర్ కాకర్ల నరసన్న పాల్గొన్నారు.

Posted on 27-06-2026 07:56 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠