యువకుడిపై తప్పుడు ఆరోపణ చేసిన మైనర్ బాలిక..
తణుకులో ఓ యువకుడు తనపై దాడి చేశాడంటూ మైనర్ బాలిక శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనలో విచారణ అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో పేర్కొన్న యువకుడిని పోలీసులు విచారించగా, ఘటన జరిగిన సమయంలో అతడు తాడేపల్లిగూడెంలో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో బాలికను ప్రశ్నించగా, ఆ యువకుడు తనను వివాహం చేసుకుంటాడనే ఆశతో తనకు తానే గాయాలు చేసుకుని అతనిపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.
Posted on 20-06-2026 11:12 AM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
