పర్యావరణ పరిరక్షణ., మొక్కలు నాటిన ఎమ్మెల్యే..
భవిష్యత్ తరాలకు అందించగలిగే అత్యంత విలువైన ఆస్తి పర్యావరణమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తణుకులో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. గాలి, నీరు, నేల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వరదలు, తుఫానుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అవసరమన్నారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రతి శుక్రవారం ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు వినియోగించాలని సూచిస్తూ మున్సిపల్ సిబ్బందికి సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Posted on 05-06-2026 09:56 AM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers

