క్లీన్ తణుకు లక్ష్యంగా రూ.5 కోట్ల వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌కు శంకుస్థాపన..
ప్రజల సహకారంతోనే “క్లీన్ తణుకు” లక్ష్యాన్ని సాధించగలమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పురపాలక సంఘం పరిధిలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తడి-పొడి వ్యర్థాల నిర్వహణ ప్లాంటుకు ఆయన శంకుస్థాపన చేశారు. రోజుకు 50 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో చెత్తను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా సైకిల్‌పై పలు కార్యక్రమాలకు హాజరై ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే, “నో వెహికల్ డే” ప్రతి శుక్రవారం ను విజయవంతం చేయాలని కోరారు.
Posted on 05-06-2026 02:35 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers

