పవర్ కట్ అలెర్ట్..
తణుకు: విద్యుత్ లైన్ల మరమ్మతుల పనుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తణుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ నరసింహమూర్తి తెలిపారు. బొమ్మల వీధి, చర్చి రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, మందరపు వారి వీధి, హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
Posted on 19-06-2026 07:42 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
