TANUKU-INFO

డ్రగ్స్‌పై అవగాహన కోసం హాస్టల్ సందర్శించిన ఎక్సైజ్ అధికారులు..

తణుకు: గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు కేర్ కమిటీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు పైడిపరు ప్రాంతంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో మాట్లాడి విద్యార్థుల్లో మత్తు పదార్థాల వినియోగంపై సమాచారం సేకరించారు. ఎవరైనా వ్యసనాలకు లోనైతే లేదా బయటి వ్యక్తులు విక్రయించే ప్రయత్నం చేస్తే వెంటనే తెలియజేయాలని సూచించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి, ఎస్ఐలు, హాస్టల్ అధికారులు పాల్గొన్నారు.

Posted on 11-04-2026 08:18 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠