TANUKU-INFO

తణుకులో జాయింట్ కలెక్టర్ పర్యటన..

తణుకు: జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తణుకు రైతు బజార్, మండపాక రైతు సేవా కేంద్రం, తేతలి సిఎన్‌జి మదర్ స్టేషన్‌ను సందర్శించి సమీక్షించారు. సిఎన్‌జి స్టేషన్‌లో భద్రత, నిర్వహణపై ఆదేశాలు ఇచ్చారు. రైతు బజార్‌లో ధరలు, శుభ్రత, సౌకర్యాలపై పరిశీలించి వినియోగదారులను ఆకర్షించే చర్యలు తీసుకోవాలని సూచించారు. మండపాకలో ధాన్యం సేకరణ, నిల్వలను సమీక్షించి గోనె సంచులు తక్షణం అందించాలని ఆదేశించారు. రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Posted on 22-04-2026 05:56 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠